5 సెకన్ల‌లో క‌రోనావైర‌స్ ను గుర్తించ‌వ‌చ్చు..!

|

Apr 25, 2020 | 10:49 PM

కోవిడ్-19 వైర‌స్ ను 5 సెకన్లలోనే గుర్తించే ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్‌ కమల్‌జైన్ పేర్కొన్నారు. క‌రోనా సింట‌మ్స్ ఉన్న‌వారి ఎక్స్‌రే స్కాన్‌ను పరిశీలించడం ద్వారా క‌రోనాను గుర్తించవచ్చని వెల్ల‌డించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా టెస్టింగ్ జరిపితే..ఖ‌ర్చు త‌గ్గడంతో పాటు బాధితుల‌కు మ‌హ‌మ్మారి సోకే ప్ర‌మాదం కూడా ఉండ‌దంటున్నారు. ‘‘ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు కొవిడ్‌, క్షయ, న్యుమోనియ పేషెంట్ల ఎక్స్‌రేలు సహా మొత్తం 60 వేల ఎక్స్‌రే స్కాన్‌లను క్ష‌ణ్ణంగా ప‌రిశీలించాం. […]

5 సెకన్ల‌లో క‌రోనావైర‌స్ ను గుర్తించ‌వ‌చ్చు..!
Follow us on

కోవిడ్-19 వైర‌స్ ను 5 సెకన్లలోనే గుర్తించే ఓ సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్‌ కమల్‌జైన్ పేర్కొన్నారు. క‌రోనా సింట‌మ్స్ ఉన్న‌వారి ఎక్స్‌రే స్కాన్‌ను పరిశీలించడం ద్వారా క‌రోనాను గుర్తించవచ్చని వెల్ల‌డించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా టెస్టింగ్ జరిపితే..ఖ‌ర్చు త‌గ్గడంతో పాటు బాధితుల‌కు మ‌హ‌మ్మారి సోకే ప్ర‌మాదం కూడా ఉండ‌దంటున్నారు.

‘‘ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవ‌ల‌ప్ చేసేందుకు కొవిడ్‌, క్షయ, న్యుమోనియ పేషెంట్ల ఎక్స్‌రేలు సహా మొత్తం 60 వేల ఎక్స్‌రే స్కాన్‌లను క్ష‌ణ్ణంగా ప‌రిశీలించాం. ఊపిరితిత్తుల్లో పేరుకున్న శ్లేష్మం ఆధారంగా ఈ మూడు జబ్బుల రోగులను విడివిడిగా గుర్తించగలిగాను’’ అని జైన్ వెల్ల‌డించారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా డాక్ల‌ర్లు.. అనుమానితుల ఎక్స్‌రేలను అప్‌లోడ్‌ చేసి కేవలం 5 సెకన్లలో కోవిడ్ ఉందో లేదో తేల్చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి తనకు 40 రోజులు పట్టిందని, పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకున్న‌ట్లు తెలిపారు.