మీరు బైడెన్ కి ఓటేస్తే, క్రిస్మస్ ఉండదు, ఇంకా, ట్రంప్ !

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 4:03 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ అధ్యక్షుడు ట్రంప్... ఈ పదవికి పోటీ పడుతున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తమ ప్రచార హోరును పెంచారు. మిచిగాన్, ఆరిజోనా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో..

మీరు బైడెన్ కి ఓటేస్తే, క్రిస్మస్ ఉండదు, ఇంకా, ట్రంప్ !
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ అధ్యక్షుడు ట్రంప్… ఈ పదవికి పోటీ పడుతున్న డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ తమ ప్రచార హోరును పెంచారు. మిచిగాన్, ఆరిజోనా, ఫ్లోరిడా తదితర రాష్ట్రాల్లో ఒకరిని మించి మరొకరు ప్రసంగాలు చేస్తున్నారు. నెవాడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్, తన ప్రత్యర్థి జో బైడెన్ అధికారంలోకి వస్తే ప్రజలకు క్రిస్మస్ పండుగ ఉండదని, అలాగే జులై 4 పర్వదినం కూడా ఉండదని హెచ్చరించారు. మీ పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు.. వారికి గ్రాడ్యుయేషన్ ఉండదు..అసలు వండర్ ఫుల్ లైఫ్ కి మీరు దూరమవుతారు అని కూడా ఓటర్లనుద్దేశించి అన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ ప్రబలం కావడానికి ట్రంప్ కారణమని, ఆయన సరైన చర్యలు తీసుకోకపోవడంవల్లే 2 లక్షల మందికి పైగా కరోనా రోగులు మరణించారని జో బైడెన్ అన్నారు. మిచిగాన్ లో బైడెన్ కి మద్దతుగా మాజీ అధ్య,క్షుడు బరాక్ ఒబామా కూడా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.