తొమ్మిదేళ్ల కాపురం తర్వాత భార్య మహిళ కాదని తెలిస్తే…!
ముచ్చటగా కాపురం చేసుకుంటున్న ఆలుమగలకు తొమ్మిదేళ్ల తర్వాత ఓ భయంకరమైన నిజం తెలిసింది.. ఆ దంపతులు మగమగలేనని తేలింది..
ముచ్చటగా కాపురం చేసుకుంటున్న ఆలుమగలకు తొమ్మిదేళ్ల తర్వాత ఓ భయంకరమైన నిజం తెలిసింది.. ఆ దంపతులు మగమగలేనని తేలింది.. కోల్‌కతాలో వెలుగులోకి వచ్చిన ఈ విచిత్ర సంఘటన పాపం ఆ భార్యభర్తలకు కన్నీళ్లు మిగిల్చింది. భార్యకు కడుపు నొప్పి వచ్చి ఆసుపత్రికి వెళ్లింది కాబట్టి ఈ నిజం తెలిసింది కానీ లేకపోతే జీవితాంతం వారిద్దరూ ఆన్యోన్యంగా సంసారం చేసుకునేవారేమో! కోల్‌కతాలోని బీర్‌భమ్‌కు చెందిన ఓ 30 ఏళ్ల మహిళకు తట్టుకోలేనంత కడుపునొప్పి వచ్చింది.. వైద్యులను సంప్రదిస్తే వారు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ కేన్సర్ ఆసుపత్రికి వెళ్లమన్నారు.. అక్కడ డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు టెస్టిక్యులర్ కేన్సర్ సోకినట్టు టెస్టుల్లో తేలింది.. ఈ దుర్వార్తతో పాటు ఆమె మహిళ కాదన్న విషయాన్ని చెప్పారు వైద్యులు.. సాధారణంగా మహిళలలో XX క్రోమోజోములుంటాయి.. కానీ ఆమెలో మాత్రం పురుషుల్లాగే XY క్రోమోజోములున్నాయి.. ఈ నిజం వైద్యపరీక్షలలో తేలింది.. చూడ్డానికి మహిళలాగే కనిపిస్తున్నా.. ఆమె గొంతు మహిళలాగే వినిపిస్తున్నా..పురుషుడేనని తేల్చేశారు వైద్యులు.. మహిళల్లో ఉండే అన్ని హార్మోన్లు ఆమె శరీరంలో ఉన్నాయి.. అమ్మాయిలానే అన్ని అవయవాలు ఉన్నాయి.. అందుకే ఆమెకు స్త్రీ రూపురేఖలు వచ్చాయి.. అయినా సరే.. ఆమె ఆమె కాదన్నారు.. పుట్టుకతోనే ఆమెలో గర్భాశయం, అండాశయం లేవట! అందుకే ఆమెకు ఇప్పటికీ రుతుస్రావం జరగలేదంటున్నారు డాక్టర్లు.. అసలు ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు.. ప్రస్తుతమైతే ఆమెను మహిళగా మార్చడం కుదరని పనే కానీ కేన్సర్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలన్న దానిపై దృష్టి పెట్టామంటున్నారు. కీమోథెరపీ చేస్తున్నామని, ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు డాక్టర్లు. ఊహించని మరో సంఘటన ఏమిటంటే ఆమె 28 ఏళ్ల చెల్లెలిది కూడా ఇంచుమించు ఇలాంటి కథే! ఆమెకు ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటవిటీ సిండ్రోమ్ ఉందని తేల్చారు వైద్యులు..అంటే అబ్బాయిలా పుట్టినా పైకి మాత్రం అమ్మాయిలా కనిపించడమన్నమాట!