కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య!

భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన కేరళ రాష్ట్రం ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. నేడు మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి

కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 6:14 PM

మున్నార్ సమీపంలోని రాజమాలలోని పెట్టిముడి సెటిల్మెంట్ వద్ద కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 55 కి చేరుకుంది. సహాయక సిబ్బంది బుధవారం మరో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలలో ఒకటి పెట్టిముడికి సమీపంలోని గ్రావెల్ బ్యాంక్ ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్నారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ జట్లు, ఇడుక్కి ఫైర్ అండ్ రెస్క్యూ టీం, కొట్టాయం, తిరువనంతపురం నుంచి ఒక్కో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలు ఇడుక్కి రాజమాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయని జిల్లా సమాచార కార్యాలయం తెలిపింది.

మరోవైపు.. మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!