కరోనా పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు..

|

Sep 05, 2020 | 8:09 PM

దేశంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షల కోసం ముందుకొచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని తెలిపింది.

కరోనా పరీక్షల నిర్వహణపై ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలు..
Corona Virus Tests
Follow us on

ICMR issues new guidelines: దేశంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఐసీఎంఆర్‌ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షల కోసం ముందుకొచ్చే ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని తెలిపింది. అలాగే కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌లు చేయాలంది. కరోనా టెస్టుల విషయంలో ఈ నూతన గైడ్‌లైన్స్ రాష్ట్రాలు సవరించుకోవచ్చునని స్పష్టం చేసింది.

వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల్లో తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపింది. ఇక పాజిటివ్‌ నిర్ధారణయిన ఐదు నుంచి 10 రోజుల మధ్య మరోసారి పరీక్షలు నిర్వహించాలంది. వైరస్‌ నిర్ధారణకు తొలుత ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ చేయాలని.. తర్వాతే ఆర్‌టి-పీసీఆర్‌ లేదా ట్రూనాట్‌ లేదా సీబీఎన్‌ఏఏటీ టెస్టులు చేయాలంది. వృద్ధులు, రోగులు, వైరస్‌ ముప్పు ఉన్నవారందరికీ పరీక్షలు తప్పనిసరి అని.. విదేశాలకు, లేదా దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి కూడా టెస్టులు చేయాలంది. అత్యవసర సేవలు అందించే వారి కుటుంబ సభ్యులకు,
వైరస్‌ లక్షణాలు లేకున్నా సర్జరీలకు వెళ్లే ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలంది. కాగా, సర్జరీలకు వెళ్లేవారు 14 రోజుల ముందు హోం ఐసొలేషన్‌లో ఉండాలంది.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..