ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. బోర్ కొట్టి విడిపోతున్నారు.. హాట్ టాపిక్‌గా మారిన ఐఏఎస్ జంట..

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. బోర్ కొట్టి విడిపోతున్నారు.. హాట్ టాఫిక్‌గా మారిన ఐఏఎస్ జంట.. ఆ ఇద్దరు ఉన్నత ఉద్యోగులు.. అందునా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..

  • Updated On - 3:10 pm, Sat, 21 November 20 Edited By: Rajesh Sharma
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. బోర్ కొట్టి విడిపోతున్నారు.. హాట్ టాపిక్‌గా మారిన ఐఏఎస్ జంట..

ఆ ఇద్దరు ఉన్నత ఉద్యోగులు.. అందునా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ ఇప్పుడు విడాకులు కోరుతున్నారు.. వారే రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ జంట అథర్ ఆమిర్ ఉల్ షపీఖాన్, టీనా దాబిలు.2015 సివిల్స్ టాపర్‌గా నిలిచిన టీనా దాబి.. రెండో ర్యాంక్ వచ్చిన అమీర్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

దేశంలోనే సంచలనం సృష్టించిన ప్రేమ జంటగా వీరిద్దరు అందరికీ గుర్తుండిపోయారు. హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోవద్దని విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరం తెలిపినా లెక్కచేయకుండా ఒక్కటయ్యారు.. అలాంటిది ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు.. పోస్టింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం రాజాస్థాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.. భార్య, భర్తలు ఒకే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయడం అదృష్టంగా భావించారు.. కానీ రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.. ఇరు కుటుంబాల పెద్దలు గొడవలను గమనించారు.. కానీ ఉన్నత ఉద్యోగులే కదా సర్దుకుపోతారు అనుకున్నారు.. కానీ వారిద్దరి మధ్య రోజు రోజుకు గొడవలు ముదరి విడాకుల వరకు వచ్చింది.. దీంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

దీంతో అమీర్ జైపూర్‌లోని ప్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అందరిని ఎదిరించి వివాహం చేసుకున్న ఈ ప్రేమజంట.. ఇప్పుడు విడాకుల పేరుతో దేశంలో హాట్ టాఫిక్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వీరిద్దరి పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత మాత్రం దానికి ప్రేమ, పెళ్లి ఎందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. మీ సమస్యనే పరిష్కరించుకోలేని మీరు ఇక జనాల సమస్యలు ఏం పరిష్కరిస్తారని ఎగతాళి చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేస్తూ హిందూ సంప్రదాయాలను మంటగలుపుతున్నారని ఆగ్రహిస్తున్నారు.