ఏపీలో ఐఏఎస్‌ల మధ్య రగడ..!

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను అవమానపరుస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌పై అడిషనల్ సెక్రటరీ(కేబినెట్ & పియు) గురుమూర్తి సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఏరోజూ సరైన సమాచారం ఇవ్వరని.. ఒకవేళ ఏదైనా వైఫల్యం జరిగినప్పుడు తప్పంతా తమ మీద వేసి.. బాధ్యులను చేస్తున్నారని  గురుమూర్తి అన్నారు. అంతేకాకుండా సహచర ఉద్యోగుల ముందు తనను ఎల్లప్పుడూ అవమానపరుస్తూ మాట్లాడతారని తెలిపారు. ‘నేను 1993లో సివిల్స్ పరీక్షలో ఉతీర్ణత సాధించాను.  […]

ఏపీలో ఐఏఎస్‌ల మధ్య రగడ..!

Edited By:

Updated on: Nov 03, 2019 | 6:56 AM

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను అవమానపరుస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌పై అడిషనల్ సెక్రటరీ(కేబినెట్ & పియు) గురుమూర్తి సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

తమకు ఏరోజూ సరైన సమాచారం ఇవ్వరని.. ఒకవేళ ఏదైనా వైఫల్యం జరిగినప్పుడు తప్పంతా తమ మీద వేసి.. బాధ్యులను చేస్తున్నారని  గురుమూర్తి అన్నారు. అంతేకాకుండా సహచర ఉద్యోగుల ముందు తనను ఎల్లప్పుడూ అవమానపరుస్తూ మాట్లాడతారని తెలిపారు.

‘నేను 1993లో సివిల్స్ పరీక్షలో ఉతీర్ణత సాధించాను.  నా 24 ఏళ్ళ సర్వీస్‌లో.. ఆయన దగ్గర పని చేయడం చాలా కష్టంగా ఉంది. దయ చేసి నన్ను వేరే డిపార్ట్మెంట్‌కు బదిలీ చేయండంటూ’ గురుమూర్తి సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.