అవినీతి లేని పాలన అందిస్తా: ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్

| Edited By:

May 30, 2019 | 4:26 PM

అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని.. మీ గ్రామంలోని సెక్రటేరియట్‌లో 10 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2న […]

అవినీతి లేని పాలన అందిస్తా: ఏపీ నూతన సీఎం వైఎస్ జగన్
Follow us on

అవినీతి నిర్మూలనలో సీఎం ఆఫీసులో ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పొచ్చని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తామని.. మీ గ్రామంలోని సెక్రటేరియట్‌లో 10 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా మొదలు పెడతామని.. దీని వల్ల మరో లక్షా 60వేల ఉద్యోగాలు నేరుగా అందుబాటులోకి జగన్ అభిప్రాయపడ్డారు.