ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ కి కరోనా వైరస్ పాజిటివ్, ఐసోలేషన్ కి వెళ్ళా .. నో వర్రీ

| Edited By: Anil kumar poka

Mar 22, 2021 | 1:39 PM

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ కానీ ఆరోగ్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ కి వెళ్లానని తెలిపారు.

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ కి కరోనా వైరస్ పాజిటివ్, ఐసోలేషన్ కి వెళ్ళా .. నో వర్రీ
I Had Get Tested For Coronavirus Positive Says Uttrakhand Cm Tirath Singh Rawat
Follow us on

ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తెలియజేస్తూ కానీ ఆరోగ్యంగా ఉన్నానని, ప్రస్తుతం ఐసోలేషన్ కి వెళ్లానని తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా మొదట చిరిగిన జీన్స్ ధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన ముఖ్యంగా మహిళలు, యువత నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. మహిళలు, యువతులు మోకాళ్ళ మధ్య చిరిగిన జీన్స్ ధరించడాన్ని మానుకోవాలని, అసలు ఇది మన భారతీయ సంస్కృతి  కాదని ఆయన అన్నారు.  ఇక పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలు, విద్యార్థినులు కూడా ఆయన తీరును దుయ్యబట్టడంతో చివరకు క్షమాపణ చెప్పారు. తాను జీన్స్ కి వ్యతిరేకిని కానని, చీలికల జీన్స్ ధరిస్తేనే తనకు అభ్యంతరకరమన్నారు. ఇక నిన్నటికి నిన్న మన దేశాన్ని అమెరికా 200 ఏళ్ళు పాలించిందని, మనలను బానిసలుగా చూసిందని, అయితే ఇండియాతో పోలిస్తే తన దేశంలో కరోనా వైరస్ ని అదుపు చేయలేకపోయిందన్నారు. ఆ దేశంలో 50 లక్షలమంది ఈ వైరస్ కి గురై మరణించారన్నారు. ఇన్ని లక్షలమంది మృతి చెందారా అని విమర్శకులు నోళ్లు నొక్కుకున్నారు.

ఇక తాజాగా కోవిడ్ పాండమిక్ సమయంలో ప్రజలు ఇద్దరు పిల్లలతో సరిపెట్టకుండా కనీసం 20 మంది పిల్లలను కనాలని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దీనివల్ల అందరికీ రేషన్ సమానంగా లభించే సూచన ఉందిగా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి  సంబంధించిన లెక్క కూడా చెప్పారాయన.  ఇలా ఉండగా జీన్స్ ధారణపై తీరత్ సింగ్ చేసిన కామెంట్లపై ఆయనను హోమ్ మంత్రి అమిత్ షా వివరణ కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బిజీగా ఉన్న కారణంగా దీనిపై ఇక అయన తదుపరి చర్య తీసుకోలేకపోయారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :ఈ చింపాంజీ చేష్టలు చూస్తే నవ్వుఆపుకోలేరు.. వైరల్ వీడియో : chimpanzee antics funny video

వామ్మో.. లేడీ కాదు..పెద్ద కిలాడీ ! ఏకంగా 18 మందిని పెళ్లి చేసుకుంది : Lady Married 18 Mens Video.

కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video