ఇవాళ హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు

|

Oct 15, 2020 | 7:43 AM

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తింది. ప్రధాన చెరువులన్నీ నిండి పొంగిపోర్లుతునర్నాయి. దీంతో ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. దాదాపు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.

ఇవాళ హైదరాబాద్ లో పలుచోట్ల ట్రాఫిక్ అంక్షలు
Follow us on

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తింది. ప్రధాన చెరువులన్నీ నిండి పొంగిపోర్లుతునర్నాయి. దీంతో ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. దాదాపు హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు పలు మార్గాలను మూసివేసి, ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అరమ్‌ఘర్ జంక్షన్ దాటి హైదరాబాద్ నుంచి కర్నూల్ రోడ్ (ఎన్‌హెచ్- 44) పూర్తిగా దెబ్బతినడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. విమానాశ్రయం, ఎన్‌హెచ్-44, కర్నూల్, షాద్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలన్నీ ఔటర్‌రింగ్‌ రోడ్‌పై నుంచి వెళ్లాలని, పీవీ హైవేపైకి రావొద్దని సూచిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. మూసి ప్రవాహంతో పురానాపూల్‌ వంద అడుగుల రహదారి పూర్తిగా మూసివేశామని, ప్రయాణికులు కార్వాన్‌పై నుంచి వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

మూసీ నది ప్రవాహంతో అలీ కేఫ్, అంబర్‌పేట్ రహదారి మధ్య మూసారంబాగ్ ఆర్‌టీఏ ఆఫీస్‌ బ్రిడ్జి , అలాగే ఫలక్‌నుమా బ్రిడ్జిను పూర్తిగా మూసివేశామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నాలా ఓవర్‌ ఫ్లో కారణంగా మలక్‌పేట నుంచి ఎల్‌బీనగర్‌ రూట్‌ పూర్తిగా బ్లాక్‌ చేశామని, చెర్మాస్ మలక్‌పేట్, అక్బర్‌బాగ్, టవడ్స్ ఫైర్ స్టేషన్, చంచల్‌గుడ సమీపంలో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. చాదర్‌ఘట్‌ కాజ్‌వే వంతెన మూసివేసి రోటరీ వైపు మళ్లించారు. అలాగే ఫలక్‌నుమా నుంచి బండ్లగూడ వెళ్లే రోడ్డును సైతం అధికారులు మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.