Corona Vaccine Dry Run: 8న హైదరాబాద్ జిల్లా పరిధిలో మరోసారి కరోనా వ్యాక్సిన్ డ్రైరన్
Corona Vaccine Dry Run: హైదరాబాద్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దఫాగా ఆరోగ్య వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు...
Corona Vaccine Dry Run: హైదరాబాద్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మొదటి దఫాగా ఆరోగ్య వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. అయితే నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి మొత్తం 78,226 మందిని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే నగరంలో మొత్తం 260 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.. ప్రతి కేంద్రంలో రోజుకు వంద మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
అయితే శుక్రవారం మరోసారి నగరంలో డ్రైరన్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఉస్మానియా ఆస్పత్రిలో ఈనెల 8న నిర్వహించనున్న కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌ను విజయవంతం చేసేందుకు 12 మందివైద్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించేందుకు డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో 8 ప్రధాన ఆస్పత్రుల్లో డ్రైరన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.