భారతీయ వ్యక్తి అందునా తెలుగువాడు యూకేలో కాలర్ ఎగరేసేలా చేశాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కన్నెగంటి చంద్ర మోహన్ యూకేలోని స్టోక్ ఆన్ ట్రెంట్ డిప్యూటీ లార్డ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవికి తెలుగువారు ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. యూకేలో 23 పెద్ద సిటీలకు కన్నెగంటి చంద్ర బాధ్యత వహిస్తారు. చంద్ర మోహన్ కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి… లేబర్ పార్టీ అభ్యర్థిపై 23 ఓట్ల తేేడాతో విజయం సాధించారు. గోల్డెన్‌హిల్, శాండీఫోర్డ్ కౌన్సిలర్‌గా కన్నెగంటి ఉన్నారు. 2006లో స్టోక్‌కు వచ్చి, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాని…అందుకే ప్రజలు ఈ విజయం అందించారని చంద్ర మోహన్ పేర్కొన్నారు.
Also Read :
ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం