కరోనా లక్షణాలు లేనివారికే అనుమతి: మెట్రో ఎండీ

|

Sep 05, 2020 | 4:41 PM

అన్‌లాక్ 4.0 నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా లక్షణాలు లేనివారికే అనుమతి: మెట్రో ఎండీ
Follow us on

Hyderabad Metro: అన్‌లాక్ 4.0 నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నిబంధనలు అనుగుణంగా అన్ని మెట్రో స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తామన్నారు. అలాగే స్టేషన్లలో, రైళ్లలో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మెట్రో స్టేషన్లు అన్నింటిలోనూ ఐసోలేషన్ రూంలు రెడీ చేస్తున్నామని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తామన్న ఆయన.. ప్రయాణీకులు తక్కువ లగేజీతో ప్రయాణించాలని సూచించారు.

కాగా, సెప్టెంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు దశల వారీగా ప్రారంభం కానున్నాయి. మొదటిగా 7న మియాపూర్- ఎల్‌బీ నగర్, ఆ తర్వాత 8న నాగోల్- రాయదుర్గం, 9న ఎంజీబీఎస్- జేబీఎస్ రూట్లు ప్రారంభమవుతాయి. ఇక తొలి రెండు రోజులు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు తిరగనుండగా.. ఆ తర్వాత 9వ తేదీ నుంచి ఉదయం 7 గంటల – రాత్రి 9 గంటల వరకు మెట్రో సర్వీసులు తిరగనున్నాయి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..