సినిమా హబ్‌గా మారుతున్న హైదరాబాద్, మన స్టూడియోలే బెస్ట్ అంటోన్న బాలీవుడ్ మేకర్స్

|

Nov 27, 2020 | 2:25 PM

సినిమా షూటింగ్ అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు.. వందల మంది ఒకే చోట పని చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో అంత మంది కలిసి పనిచేయాలంటే అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా కావాలి.

సినిమా హబ్‌గా మారుతున్న హైదరాబాద్, మన స్టూడియోలే బెస్ట్ అంటోన్న బాలీవుడ్ మేకర్స్
Follow us on

సినిమా షూటింగ్ అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు.. వందల మంది ఒకే చోట పని చేయాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో అంత మంది కలిసి పనిచేయాలంటే అదే స్థాయిలో ఏర్పాట్లు కూడా కావాలి. మరి అలాంటి ఏర్పాట్లు ఎక్కడున్నాయి. ఈ ప్రశ్నలకు అన్ని ఇండస్ట్రీల నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క ఆన్సర్‌ హైదరాబాద్‌. సినిమా హబ్‌గా మారుతున్న భాగ్యనగరం షూటింగ్‌లకు బెస్ట్‌ ఛాయిస్‌ అని ప్రూవ్ చేసుకుంటుంది. టాప్ స్టార్లతో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేయాలంటే హైదరాబాద్ స్టూడియోలే బెస్ట్ అనుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్‌. అందుకే బిగ్ బడ్జెట్‌ హిందీ సినిమాల మేకర్స్‌ కూడా షూటింగ్‌ల కోసం హైదరాబాద్‌ బాట పడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలు సౌకర్యాల పరంగా ముందుండమే కాదు.. స్పేషియస్‌గా ఉండటం కూడా ప్లస్ అవుతోంది. అందుకే బిగ్‌ స్టార్స్‌తో సినిమాలు చేయటం ఇక్కడ ఈజీ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్‌.

ఇక పాన్ ఇండియా సినిమా అంటే మేడిన్ హైదరాబాద్‌ అన్న ట్యాగ్ ఎప్పుడో పడిపోయింది. అలాంటి సినిమాల కోసమే.. అజయ్‌ దేవగన్‌, కంగనా ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. కేజీఎఫ్‌ షూట్‌ కోసం మరో వారంలో సంజయ్‌ దత్‌ కూడా వచ్చేస్తున్నారు. సౌత్‌ స్టార్స్‌ కూడా షూటింగ్‌లకు బెస్ట్ ప్లేస్‌ హైదరాబాదే అని ఫిక్స్‌ అవుతున్నారు. అందుకే సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ రెగ్యులర్‌గా తన సినిమాలను హైదరబాద్‌లోనే షూట్‌ చేస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్ హీరో అజిత్ కూడా వలిమై షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే చేస్తున్నారు. లేటెస్ట్‌గా యష్‌ కూడా కేజీఎఫ్‌ క్లైమాక్స్‌ కోసం హైదరాబాద్లో అడుగు పెట్టేశారు. ఇలా సౌత్‌ నార్త్ అన్న తేడా లేకుండా స్టార్స్‌ అంతా సినిమా మేకింగ్ అంటే హైదరాబాద్ వైపే చూస్తున్నారు.

Also Read :

నేడు ఏపీ కేబినెట్ భేటీ, సభలో పెట్టే బిల్లులపై చర్చ, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై కీలక నిర్ణయం

ఏపీలో 53 మంది మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు, అలా చేస్తే ఆర్డర్స్ రద్దు