AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఉప్పల్‌లో చిరుత అంటూ వైరల్‌.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌–నాగోల్‌ పరిధిలో చిరుత సంచరిస్తోందంటూ వైరల్‌ అయిన ఫొటో కలకలం రేపింది. అయితే అది AI సాయంతో సృష్టించిన నకిలీ చిత్రమని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఫతుల్లాగూడ సమీపంలో చిరుత కనిపించిందంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటనతో ధృవీకరించని ఫొటోలు, వార్తలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయవద్దనే హెచ్చరిక మరోసారి తెరపైకి వచ్చింది.

వామ్మో.. ఉప్పల్‌లో చిరుత అంటూ వైరల్‌.. అసలు విషయం తెలిసి షాకైన పోలీసులు..
Nagole Leopard Fake News
Shaik Madar Saheb
|

Updated on: Oct 27, 2026 | 8:58 AM

Share

వామ్మో ఉప్పల్‌లో చిరుత సంచారం అంటూ.. నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.. దీని గురించి ఆరా తీస్తే.. ఏఐ అసలు గుట్టు బయటపడింది.. ఉప్పల్‌-నాగోల్‌ పరిధిలో చిరుత పులి లేదు. ఆ ఏరియాలో ఎక్కడా కూడా చిరుత సంచరించడం లేదు. పబ్లిక్ భయపడాల్సిన అవసరం లేదు.. ఉప్పల్‌-నాగోల్‌ పరిధిలో చిరుత పులి సంచారం అంతా హంబక్ అంటూ పోలీసులు తెలిపారు. AIతో కాలనీల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఫోటో సృష్టించిన ఓ ఆకతాయి దానిని వైరల్ చేశాడు.. ఫతుల్లాగూడ సమీపంలో అంటూ చాలా సహజంగా కనిపించేలా చిరుత ఫోటో క్రియేట్ చేశాడు. లోకల్ గ్రూప్స్‌లో వైరల్ అవ్వడంతో ఉప్పల్ – నాగోల్ ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. ఫోటోకు ఫోజులిస్తున్నట్లుగా చిరుత కనిపించడంతో అటవీశాఖ పోలీసుల్లో డౌట్ వచ్చింది. లా అండర్ ఆర్డర్‌ పోలీసుల సాయంతో టెక్నాలజీ వాడి ఆరా తీస్తే నిందితుడు పట్టుబడ్డాడు.. తాగిన మత్తుల్లో AI ఫోటో క్రియేట్ చేసినట్లు పోలీసుల ఎదుట చెప్పాడు.

పనిగట్టుకుని ఆకతాయి పని చేసి అడ్డంగా దొరికిపోయాడు సచిన్. ఉప్పల్‌లో ఓ స్థలాన్ని ఫోటో తీసి ఆ తర్వాత దాంట్లో చిరుతను యాడ్ చేశాడు సచిన్. ఫోటోను వైరల్ చేయడంతోపాటు తాను చిరుతను చూశానని ఆయనే ఎమర్జెన్సీ నెంబర్‌ 112కి కాల్ చేసి చెప్పాడు. రిస్క్ ఎందుకులే అని అటవీశాఖ సాయంతో ఆ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. అయితే ఆ ఫోటోలో ఉన్న చిరుత రకం అసలు మన ఏరియాలోనే ఉండదు అని వాళ్లు క్లారిటీ ఇవ్వడంతో.. స్వయంగా తాను చూశానన్న సచిన్‌ని ఆరా తీశారు. సీన్ కట్ చేసి తాగి చేశాను సర్ అంటూ సచిన్ తన సైకోయిజాన్ని బయటపెట్టాడు..

అయితే.. ఇలాంటి ఘటనలపై పోలీసులు కటిన చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారింది.

Uppal Leopard News Fake

Uppal Leopard News Fake

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
AIతో చిరుతను సృష్టించి వైరల్‌ చేశాడు.. పోలీసులకు చిక్కిన సచిన్‌
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఘోరం.. గాలికి ఎగిరిన టోపీ కోసం వెళ్లి
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
Viral Video: నిద్రపోతున్న కూలీలపైకి దూసుకొచ్చిన చిరుతపులి..!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
చలికాలంలో అరకు అందాలు.. వెళ్తే ఈ ప్లేసెస్ మిస్ అవ్వకండి!
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
తమిళనాడుల కలకలం.. జైలు నుంచి తప్పించుకున్న 17 మంది ఖైదీలు..
ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా..
ఆ దెబ్బతో సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా..
ధోనీని దాటేసిన తిలక్ వర్మ..ఛేజింగ్‌లో అదరగొట్టిన యంగ్‌స్టర్
ధోనీని దాటేసిన తిలక్ వర్మ..ఛేజింగ్‌లో అదరగొట్టిన యంగ్‌స్టర్
భర్త వైద్య చికిత్స కోసం దొంగతనాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌
భర్త వైద్య చికిత్స కోసం దొంగతనాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌
భువీ ఔట్.. మయాంక్ ఇన్.. 3వ టీ20కి టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..?
భువీ ఔట్.. మయాంక్ ఇన్.. 3వ టీ20కి టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..?
బుమ్రా, పంత్ రీఎంట్రీకి రంగం సిద్ధం
బుమ్రా, పంత్ రీఎంట్రీకి రంగం సిద్ధం