మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. మానవసంబంధాలు కనుమరుగవుతున్నాయి. భార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవలు జీవితాలను పూర్తిగా నాశనం చేస్తే మరీ కొన్ని జీవితాలు మాత్రం అతాలా కుతాలం అవుతున్నాయి.. అలాంటి సమయాల్లో సమన్వయం పాటించాలి లేకుంటే కాపురాలు నాశనం అవుతున్నాయి. భార్యతో గొడవపడిన భర్త ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసిన దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లా వత్తికూడి గ్రామంలో చోటుచేసుకుంది. వత్తికూడి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా శ్రీజ పనిచేస్తున్నారు. శ్రీజతో ఆమె భర్త అనీష్ గత కొంత కాలంగా గొడవ పడుతున్నాడు. భార్య శ్రీజతో విబేధాలతో గొడవపడిన భర్త అనీష్ రబ్బరు షీటులో యాసిడ్ తీసుకువచ్చి ఆమెపై పోశాడు. ఈ దాడిలో శ్రీజ తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబసభ్యలు స్థానికుల సాయంతో శ్రీజను ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రగాయాలతో ప్రస్తుతం కొనఉపిరితో కొట్టుమిట్టాడుతోంది శ్రీజ. భార్యపై యాసిడ్ దాడి చేసిన అనీష్ ను అరెస్ట్ చేసి.. అతనిపై ఐపీసీ సెక్షన్ 326 ఎ కింద కేసు నమోదు చేశామని ఇడుక్కీ జిల్లా పోలీసులు చెప్పారు.