భార్యపై అనుమానం… వివస్త్రను చేసి వీడియోలు..

అనుమానం పెనుభూతంగా మారింది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి సంసారంలో అగ్గిరాజుకుంది. 15 ఏళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో వికృత చేష్టాలకు పాల్పడ్డాడో భర్త.

భార్యపై అనుమానం... వివస్త్రను చేసి వీడియోలు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 27, 2020 | 3:08 PM

అనుమానం పెనుభూతంగా మారింది. ప్రశాంతంగా సాగిపోతున్న వారి సంసారంలో అగ్గిరాజుకుంది. 15 ఏళ్ల కాపురంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో వికృత చేష్టాలకు పాల్పడ్డాడో భర్త. ఆమెను శారీరకంగా వేధిస్తూ..రాక్షసానందం పొందాడు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన మహిళను బంధువులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. వనపర్తి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన అందరని కలచివేచింది. వివరాల్లోకి వెళితే…

వనపర్తి జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. కట్టుకున్న భార్యను నిత్యం చిత్రహింసలు పెట్టాడో ప్రబుద్ధుడు. వారికి పెళ్లై 15 ఏళ్లు పూర్తయ్యాయి. 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇంతకాలం ఎంతో అన్యోంన్యంగా సాగిన వీరి కాపురంలో అనుమానం అనే చిచ్చు రాజుకుంది. ఏం జరిగిందో తెలియదు గానీ,.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు భర్త. దీంతో ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టసాగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంతో ఆమెపై దాష్టీకం ప్రదర్శించాడు. ఇనుప రాడ్డుతో తల పగులగొట్టాడు. చేతికి దొరికిన వస్తువుతో చితకబాదాడు. ఒళ్లంతా రక్తం కారుతున్నా కనికరించలేదు.

అయినా.. ఆవేశం చల్లారలేదు. ఆమెను వివస్త్రను చేసి శరీరంపై ఇనుప చువ్వలతో వాతలు పెట్టాడు. ఆ దృశ్యాలను 14ఏళ్ల కొడుకుతో సెల్‌ఫోన్లో వీడియో తీయించాడు. విషయం బయటకు తెలియటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాదితురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. కిరాతక భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..