50 రోజుల్లో రూ.40 వేల కోట్ల ‘ఎఫ్‍పీఐ’ పెట్టుబడులు

| Edited By:

Mar 21, 2019 | 5:26 PM

విదేశీ పోర్టుఫోలియో మదుపరుల(ఎఫ్‍పీఐ)కు భారత స్టాక్‌ మార్కెట్‌పై మళ్లీ గురి కుదిరింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో, ఈ సంస్థలు నిన్నటి వరకు మన మార్కెట్‌కు ముఖం చాటేశాయి. ఫిబ్రవరి నుంచి సీన్‌ మారిపోయింది. ఇపుడు మళ్లీ ఎడాపెడా కొనుగోళ్లకు దిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థలు భారత మార్కెట్‌లో రూ.40,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి. దీంతో గత నెల రోజుల్లోనే సెన్సెక్స్‌ 3,011 […]

50 రోజుల్లో రూ.40 వేల కోట్ల ఎఫ్‍పీఐ పెట్టుబడులు
Follow us on

విదేశీ పోర్టుఫోలియో మదుపరుల(ఎఫ్‍పీఐ)కు భారత స్టాక్‌ మార్కెట్‌పై మళ్లీ గురి కుదిరింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో, ఈ సంస్థలు నిన్నటి వరకు మన మార్కెట్‌కు ముఖం చాటేశాయి. ఫిబ్రవరి నుంచి సీన్‌ మారిపోయింది. ఇపుడు మళ్లీ ఎడాపెడా కొనుగోళ్లకు దిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థలు భారత మార్కెట్‌లో రూ.40,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశాయి. దీంతో గత నెల రోజుల్లోనే సెన్సెక్స్‌ 3,011 పాయింట్లు (8.5 శాతం), నిఫ్టీ 928 పాయింట్లు (8.75 శాతం) దూసుకుపోయాయి.

గత ఏడాదంతా ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌పై శీతకన్నేశాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటు, చమురు సెగ, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణాలు. గత 12 నెలల్లో ఎఫ్‌పీఐలు తొమ్మిది నెలలపాటు భారత స్టాక్‌ మార్కెట్‌లో నికర అమ్మకాలు జరిపాయి. గత ఏడాది ఫిబ్రవరి-ఈ సంవత్సరం జనవరి మధ్య ఈ సంస్థలు రూ.82,652 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరిపారు. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తీవ్ర ఆటుపోట్లకు గురయ్యాయి.