Fire Accident : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. టైర్ల కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌లోని నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ గోకుల్‌ నగర్‌లోని అపోలో టైర్ల కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో..

Fire Accident : హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. టైర్ల కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు

Updated on: Dec 22, 2020 | 9:37 PM

Huge Fire Broke : హైదరాబాద్‌లోని నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మల్లాపూర్ గోకుల్‌ నగర్‌లోని అపోలో టైర్ల కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్న మొదలైన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారనేది తెలియలేదు.