ఏవీబీలో మావోల డంప్ లభ్యం

|

Nov 12, 2020 | 3:06 PM

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న మల్కాన్​గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కూంబింగ్​లో మావోలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్న సంగతి తెలిసిందే.

ఏవీబీలో మావోల డంప్ లభ్యం
Follow us on

ఆంధ్ర – ఒడిశా సరిహద్దులో ఉన్న మల్కాన్​గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులకు చెందిన భారీ డంప్​ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన కూంబింగ్​లో మావోలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ సమయంలో వీటిని పోలీసులు గుర్తించారు.

మల్కాన్‌ గిరి జిల్లా అండ్రపల్లిలో భారీ డంప్‌ను పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. స్వాభిమాన్ ఆంచల్ ఏరియాలో ఓడీఎఫ్- డీవీఎఫ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ భారీ డంప్‌ను గుర్తించారు. ఇందులో 13 డిటోనేటర్లు , 14 హ్యాండ్ గ్రెనేడ్లు, 93 రౌండ్ల 303 రైఫిల్ బుల్లెట్లు, 55 రౌండ్ల ఫిస్టల్ బుల్లెట్లు, 2 ల్యాండ్ మైన్లు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇది ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవిగా పోలీసులు నిర్ధారించారు. ఒడిషా ప్రాంతంలో పెద్ద ఎత్తున డంప్ పట్టుబడటంతో విశాఖ ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆయుధాలను ఇంత పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ డంప్ పట్టుబడిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడైన ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.