NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

|

Oct 29, 2020 | 11:42 PM

అంతరిక్షంలో ఎన్నో రకాల ఆస్టరాయిడ్స్ ఉంటాయి. వాటిపై గత కొంతకాలంగా పలు రకాల పరిశోధనలు జరగుతున్నాయి. ఈ తరుణంలో ..

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!
Follow us on

Asteroid 16 Psyche News: అంతరిక్షంలో ఎన్నో రకాల ఆస్టరాయిడ్స్ ఉంటాయి. వాటిపై గత కొంతకాలంగా పరిశోధనలు జరగుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా నాసా ఓ ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఖగోళంలోని అతి పెద్ద ఆస్టరాయిడ్స్‌లో ఒకటైన 16 సైక్(16 Psyche) వల్ల భూమి మీద ఉన్న అందరూ ధనవంతులు అయిపోవచ్చునని తేల్చింది. దీనికి సంబంధించి The Planetary Science Journal ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. ప్రస్తుతం 16 సైక్ గ్రహశకలం అంగారక గ్రహం(Mars), గురు గ్రహం(Jupiter) మధ్య ఉందని.. దాదాపు భూమికి 230 మిలియన్ మైల్స్ దూరంలో ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

16 సైక్(16 Psyche)లో అత్యంత విలువైన బంగారం, ప్లాటినం, వజ్రాలతో పాటు మరెన్నో విలువైన లోహాలు, ఖనిజాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాటి విలువ దాదాపుగా 10,000 క్వాడ్రిలియన్ డాలర్లు ఉంటాయని అంచనా. అంటే ప్రపంచం మొత్తం ఆదాయం కంటే ఎక్కువ విలువైనదిగా వారు అభిప్రాయపడుతున్నారు. తాజాగా హుబల్ స్పేస్ టెలీస్కోప్ ద్వారా పరిశోధకులు 16 సైక్(16 Psyche) ఆస్టరాయిడ్‌ను మరింత దగ్గరగా చూశారు. కాగా, 2022లో ఈ ఆస్టరాయిడ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు నాసా ఓ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించాలని ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆ 16 సైక్(16 Psyche) ఆస్టరాయిడ్‌ ఉపరితలం అంతా ఐరన్‌తో ఉండొచ్చని పరిశోధకులు చెప్పారు. దాదాపుగా 17 మిలియన్ బిలియన్ టన్నుల ఐరన్, నికోల్ లాంటి ఖనిజాలు ఉంటాయని అంచనా వేశారు. 16 సైక్ మిషన్‌ను అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నడిపిస్తున్న సంగతి విదితమే.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..