
కరోనా సంక్షోభ సమయంలో.. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతి చౌకైన కరోనా పరీక్ష కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ బుధవారం ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు. ఇది చరిత్రాత్మక ఘటన అని ఆయన అభివర్ణించారు. ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కరోనా పరీక్ష కిట్‌ను ఐఐటీ ఢిల్లీ రూపొందించగా న్యూటెక్ మెడికల్ కంపెనీ దీనిని వాణిజ్యపరంగా తయారు చేసి ‘కోరోసూర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. తమ కరోనా పరీక్ష కిట్ ధర సుమారు రూ.650 ఉంటుందని ఆ సంస్థ ఎండీ జతిన్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు.
అతి తక్కువ ధర గల ‘కోరోసూర్’ పరీక్ష కిట్ రాకతో దేశంలో కరోనా పరీక్షల తీరు మారుతుందని అన్నారు. ఐఐటీ ఢిల్లీ సాంకేతికతో న్యూటెక్ మెడికల్ డివైసెస్ సంస్థ తయారు చేసిన ఈ కిట్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఒక నెలలో సుమారు 20 లక్షల కరోనా పరీక్షలు చేయవచ్చని ఐఐటీ ఢిల్లీ ఢైరెక్టర్ వీ రామ్ గోపాల్‌రావు తెలిపారు. తమ కరోనా పరీక్ష కిట్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్లు ఆయన చెప్పారు.
[svt-event date=”15/07/2020,3:47PM” class=”svt-cd-green” ]
Launching the world’s most affordable probe free RT-PCR based #COVID19 diagnostic kit, along with MoS for HRD Shri @SanjayDhotreMP ji. #AatmaNirbharBharat https://t.co/7u9dqR79W9
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 15, 2020