వాట్సప్ అనేది ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఎందుకంటే ఇది మరింత సరళమైనది,సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. మెసేజింగ్ యాప్‌లో ఉండాల్సిన చాలా ముఖ్యమైన ఫీచర్‌లు ఇందులో ఉన్నాయి. దీనిని ఫ్రెండ్లీ మెసేజింగ్ యాప్ అని పిలుచుకుంటారు. దాని సహాయంతో ప్రపంచంలోని ఎవరికైనా వీడియో లేదా వాయిస్ కాల్‌లు చేయవచ్చు.. వాయిస్ సందేశాలను కూడా పంపుకోవచ్చు. ఫోటోలు లేదా వీడియోలను ట్రాన్ఫర్ చేసుకోవడానికి మరో ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది కాకుండా, వినియోగదారులు వాట్సాప్‌లో ఏదైనా సందేశాన్ని తొలగించే ఎంపికను కూడా పొందుతారు. అయితే డిలీట్ చేసిన మెసేజ్‌లను మళ్లీ ఎలా చదవాలో, ఈరోజు మనం ఈ ట్రిక్స్ గురించి చెబుతున్నాం.
ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఈ “డిలీట్ మెసేజ్” ఫీచర్‌ను అందిస్తాయి. అయితే ఇది మెరుగ్గా అమలు చేయబడుతుంది. తొలగించబడిన సందేశం గురించి యాప్ రిసీవర్‌ని ఎప్పటికీ హెచ్చరించదు. కాబట్టి మీరు వాట్సాప్ ఈ ఫీచర్‌తో ఇబ్బంది పడినట్లయితే.. తొలగించబడిన అన్ని సందేశాలను చదవాలనుకుంటే.. మీరు క్రింద ఇచ్చిన పద్ధతిని అనుసరించవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ థర్డ్ పార్టీ యాప్ ద్వారా మీ ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ఏదైనా పంపినవారి మెసేజ్ చదివడానికి వీలుంది. మనం ఏం చదువుతున్నామో.. ఏం చూస్తున్నామో కూడా ఆ యాప్ పరిశీలిస్తుంది. కాబట్టి, మీరు నోటిఫికేషన్ కోసం అనుమతి ఇవ్వాలి. మీరు ఎవరి వాట్సాప్ చాట్‌ని తెరిచి .. మెసేజ్ తొలగించబడితే.. మీరు వాటిని చదవలేరు ఎందుకంటే థర్డ్ పార్టీ యాప్ మీ WhatsAppలోని సందేశాన్ని నోటిఫికేషన్ నుంచి వెంటనే తీసుకుంటుంది. మెసేజ్ తొలగించబడిన తర్వాత, అవి వాట్సప్‌లో కనిపించవు.. కానీ మీరు వాటిని “గెట్ డిలీటెడ్ మెసేజెస్” యాప్ ద్వారా చూడవచ్చు.
తొలగించబడిన వాట్సప్ మెసేజ్లను చదవడానికి, మీరు వాట్సప్ రిమూవ్డ్+ అనే థర్డ్ పార్టీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది కానీ యాప్ స్టోర్‌లో కాదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం