Paneer 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా పనీర్ 65 తయారీ చేయడం ఎలా అంటే

|

Jun 11, 2021 | 5:58 PM

Paneer 65 Recipe: విదేశాల నుంచి మనదేశంలోకి అడుగు పెట్టిన పనీర్ శాఖాహారుల మాంసాహారపు వంటగా ప్రసిద్ధి చెందింది. ఈ పనీర్ రుచికరంగా ఉండటమే కాదు..

Paneer 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఈజీగా పనీర్ 65 తయారీ  చేయడం ఎలా అంటే
Paneer 65
Follow us on

Paneer 65 Recipe: విదేశాల నుంచి మనదేశంలోకి అడుగు పెట్టిన పనీర్ శాఖాహారుల మాంసాహారపు వంటగా ప్రసిద్ధి చెందింది. ఈ పనీర్ రుచికరంగా ఉండటమే కాదు శరీరానికి తగిన పోషకాలను అందిస్తుంది. పనీర్ తో బిర్యానీ, గ్రేవీ కూర, 65 వంటి అనేక రకాల ఆహార పదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈరోజు పనీర్ 65 తయారు చేయడం తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు:

పనీర్‌
ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు,
పచ్చిమిర్చి – తరుగు
కొత్తిమీర
మైదా – పావు కప్పు,
కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను,
అల్లం పేస్టు – ఒక టీస్పూను
కారం – రుచికి సరిపడినంత
పసుపు కొంచెం
గరం మసాలా – టీస్పూను,
నూనె – సరిపడినంత
ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం :

ముందుగా స్టవ్‌ మీద బాణలి పెట్టి కొంచెం నూనె పోయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కలను వేసి. తర్వాత పన్నీర్‌ ముక్కలు, కార్న్‌ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేయాలి.. వీటన్నిటిని కొంచెం సేపు వేయించాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.. కొంచెం సేపు వేగిన తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం నీరు పోసి ఉడికించాలి. .

ఇంతలో మరో బర్నర్‌ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఈ పోపులో వేగిన పనీర్‌ ముక్కల్ని తీసి కలపాలి. అంతే పన్నీర్ 65 రెడీ.

Also Read: Yellandu TRS Mla: తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే