Aadhaar Card: ఆధార్ కార్డు అసలైనదా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?

|

Feb 05, 2024 | 7:12 AM

ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఉద్యోగానికైనా ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రం. ఉద్యోగాలకే కాదు సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా తీయడం వరకు అన్నింటికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఆధార్ 12 అంకెల సంఖ్య భారతీయ పౌరులందరికీ గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది. మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే అది అసలైనదా? నకిలీదా అని తనిఖీ చేయడం ముఖ్యం. నకిలీ..

Aadhaar Card: ఆధార్ కార్డు అసలైనదా? నకిలీదా? తెలుసుకోవడం ఎలా?
Aadhaar Card
Follow us on

ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఉద్యోగానికైనా ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రం. ఉద్యోగాలకే కాదు సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు ఖాతా తీయడం వరకు అన్నింటికి ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. ఆధార్ 12 అంకెల సంఖ్య భారతీయ పౌరులందరికీ గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది. మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే అది అసలైనదా? నకిలీదా అని తనిఖీ చేయడం ముఖ్యం. నకిలీ ఆధార్ కార్డు మీకు ప్రభుత్వ ప్రయోజనాలను దూరం చేయడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే మీ ఆధార్ కార్డ్ ప్రామాణికతను నిర్ధారించడానికి దాన్ని ధృవీకరించడం చాలా ముఖ్యం.

మీ ఆధార్ కార్డ్‌ని ధృవీకరించడానికి మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎంపికలలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డ్‌ని జారీ చేసే బాధ్యత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)కి ఉంది. మరి ఆధార్‌ను వెరిఫై చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ వెరిఫై చేయడం ఎలా?

  • ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఇక్కడ “మై ఆధార్” ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఆపై “సర్వీస్‌” ఎంపిక నుండి “ఆధార్ నంబర్‌ని ధృవీకరించండి” ఎంచుకోండి.
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.
  • ఇప్పుడు “వెరిఫై ఆధార్” పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డ్ నిజమైనదైతే అది వెబ్‌సైట్‌లో “EXISTS” అని చూపుతుంది.
  • అది ఫేక్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

ఆధార్ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌లో ఎలా ధృవీకరించాలి

మీరు ఆధార్ కార్డ్‌లోని డిజిటల్ సంతకాన్ని ధృవీకరించడానికి QR కోడ్ స్కానర్‌ని ఉపయోగించవచ్చు లేదా మీరు mAadhaar యాప్ ద్వారా కార్డ్‌ను ప్రామాణీకరించవచ్చు. ఈ పద్ధతులు త్వరగా, సులభంగా ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ నిజమైనదని, అవసరమైన ఏవైనా సేవలకు అంగీకరించబడుతుందని నిర్ధారించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి