House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం

ఏపీలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి...

House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 28, 2020 | 9:28 PM

ఏపీలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులకు కొడిమి లేఔట్‌లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన ప్లాట్ల వద్ద ‘థ్యాంక్యూ జగనన్న’ అని ఇంగ్లీష్ అక్షరాల రూపంలో  నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్‌ తమను ఓ ఇంటి వాళ్లుగా చేశారని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇంత మంచి ప్రాంతంలో ఇంటి స్థలాలను అందించినందుకు సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. లేఔట్‌లోని ప్రతి ప్లాట్‌ వద్దకు స్వయంగా వెళ్లి పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనంత అందజేశారు.

Also Read :

Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !

Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..