Hot water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తే ఇన్ని సమస్యలు వస్తాయా? షాకింగ్ నిజాలు తెలుసుకోండి..

చలికాలం వచ్చిందంటే చాలు శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అంతా వెచ్చదనం కోసం చలికోట్లు వేసుకోవడం, పడుకున్నప్పుడు దలసరిగా ఉన్న దుప్పట్లలోకి దూరిపోతుంటారు.

Hot water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తే ఇన్ని సమస్యలు వస్తాయా? షాకింగ్ నిజాలు తెలుసుకోండి..
చర్మం పొడి బారడం : మన చర్మంలో నుంచి సహజంగా ఆయిల్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా, చర్మ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. మరీ వేడి నీళ్లతో స్నానం చేసినా, బాత్ టబ్ లోని వేడి నీళ్లలో ఎక్కువసేపు కూర్చున్నా అందులోని వేడి వల్ల ఈ ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో చర్మం పొడిబారి, కొత్త సమస్యలు ఎదురవుతాయి.

Updated on: Dec 12, 2022 | 1:45 PM

చలికాలం వచ్చిందంటే చాలు శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. అంతా వెచ్చదనం కోసం చలికోట్లు వేసుకోవడం, పడుకున్నప్పుడు దలసరిగా ఉన్న దుప్పట్లలోకి దూరిపోతుంటారు. అయితే ఇలాంటి సమయంలో స్నానం అనేది పెద్ద ప్రహసనం. అంతా స్నానానికి వేడి నీళ్లతో సిద్ధమవుతుంటారు. కొంతమందైతే కాలానితో సంబంధం లేకుండా కచ్చితంగా వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేస్తారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం, జుట్టు, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేడి నీళ్ల వల్ల సహజ నూనెలను కోల్పోవడం వల్ల చర్మం పొడిబారడం, అలాగే జుట్టు పెరుగుదలలో లోపాలుంటాయని పేర్కొంటున్నారు.

వేడి నీళ్లతో స్నానం వల్ల ఎక్కువగా వచ్చే ఐదు సమస్యలు:

బీపీ పెరిగే అవకాశం

వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల నరాలు ఓదార్పునివ్వడంతో రక్తపోటు స్థాయిలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. క్రమేపి ఇది గుండె జబ్బులకు కారణం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మం పొడిబారడం

అధికంగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న సహజ నూనెలు కోల్పోవడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీంతో మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం పెరుగుతుంది.

మొటిమలు

మొటిమల సమస్యతో బాధపడే వారు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కోల్పోతాం. దీంతో మొటిమల సమస్య తీవ్రతరమవుతుంది.

జట్టు పెరుగుదలలో లోపం

తరచూగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల స్లో హెయిర్ గ్రోత్ ను గమనించాలి. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల నెత్తిపై రక్త ప్రసరణ తగ్గుతుందని జుట్టు పెరుగుదలలో లోపం కలగవచ్చు. జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది.

తామర
తామర సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అధిక నష్టం కలుగుతుంది. చర్మం పొడిబారడంతో కోలుకోలేని నష్టం కలగజేస్తుంది.