తమ్మినేని వర్సెస్ అచ్చెన్నాయుడు: బీఏసీలో హాట్ ఫైట్

|

Jan 20, 2020 | 1:04 PM

ఏపీ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభానికి ముందు జనవరి 20న ఉదయం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లో టీడీపీ, వైసీపీ మధ్య హాట్ హాట్ వాదోపవాదాలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య జరిగిన సంవాదం వాడీవేడీగా జరిగిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కేపిటల్ బిల్లు ప్రవేశపెట్టడానికి రెండ్రోజుల ముందే సభ్యులందరికీ బిల్లు కాపీని అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను అచ్చెన్నాయుడు గుర్తు చేయడంతో వైసీపీ, […]

తమ్మినేని వర్సెస్ అచ్చెన్నాయుడు: బీఏసీలో హాట్ ఫైట్
Follow us on

ఏపీ అసెంబ్లీ స్పెషల్ సెషన్ ప్రారంభానికి ముందు జనవరి 20న ఉదయం జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లో టీడీపీ, వైసీపీ మధ్య హాట్ హాట్ వాదోపవాదాలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్, టీడీపీ నేత అచ్చెన్నాయుడు మధ్య జరిగిన సంవాదం వాడీవేడీగా జరిగిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం కేపిటల్ బిల్లు ప్రవేశపెట్టడానికి రెండ్రోజుల ముందే సభ్యులందరికీ బిల్లు కాపీని అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను అచ్చెన్నాయుడు గుర్తు చేయడంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్దం మొదలైందని తెలుస్తోంది. మధ్యలో వైజాగ్ జిల్లాను మావోయిస్టుల జిల్లాగా తెలుగుదేశం నేతలు ప్రచారం చేయడాన్ని స్పీకర్ తప్పు పట్టడంతో అచ్చెన్నాయుడు, తమ్మినేనిల మధ్య సంవాదానికి దారి తీసిందని సమాచారం.

ప్రభుత్వం ప్రవేశపెట్టే రాజధాని బిల్లు అధ్యయనానికి సభ్యులందరికీ కనీస సమయం ఇవ్వాలని అచ్చెన్నాయుడు బీఏసీ భేటీలో కోరారు. బిల్లును రెండు రోజుల ముందుగానే సభ్యులకు ఇస్తామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాంతో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం మధ్యలో జోక్యం చేసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారామ్… వైజాగ్ జిల్లాను మావోయిస్టుల జిల్లాగా ప్రస్తావిస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ అన్నారు.

అయితే, వైజాగ్ జిల్లాలో ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని మావోయిస్టులు చంపింది వాస్తవం కాదా అని అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఎదురు ప్రశ్నించారు. మావోయిస్టుల ప్రభావం వుంది కాబట్టి వైజాగ్ జిల్లాను మావోయిస్టుల జిల్లాగా పేర్కొన్నామని అచ్చెన్నాయుడు సమర్థించుకున్నారు. మంత్రులు జోక్యం చేసుకుని, సర్ది చెప్పడంతో సంవాదానికి తెరపడినట్లు తెలుస్తోంది.