కరోనా చికిత్స కోసం టెలీమెడిసిన్ వేదిక.. ‘స్వస్త్’ యాప్..

| Edited By:

Jun 23, 2020 | 10:00 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం దేశవ్యాప్త టెలీమెడిసిన్ వేదిక 'స్వస్త్'‌ యాప్‌ను ప్రారంభించేందుకు

కరోనా చికిత్స కోసం టెలీమెడిసిన్ వేదిక.. స్వస్త్ యాప్..
Follow us on

Telemedicine app Swasth: కోవిద్-19 విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా చికిత్స కోసం దేశవ్యాప్త టెలీమెడిసిన్ వేదిక ‘స్వస్త్’‌ యాప్‌ను ప్రారంభించేందుకు 100కు పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఏకతాటిపైకి వచ్చారు. భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు, వెల్‌నెస్ ప్రొవైడర్లను డిజిటల్‌గా కలిసే అవకాశాన్ని స్వస్త్ అందిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఆధారిత సేవలు అందుబాటు ధరలలో ఉంటూ 130కోట్ల మంది భారతీయులకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు ఉపయోగపడుతుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చికిత్సను స్వస్త్ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా డిజిటల్‌గా సంతకం చేసిన ప్రిస్క్రిప్షన్, చికిత్స విధానాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో కన్సల్టేషన్స్ అందిస్తుంది. త్వరలోనే భారతదేశంలోని 25 భాషలలో సైతం ఇది కన్సల్టేషన్స్‌ను అందించనుంది. అయితే.. ఆర్ధిక, భౌగోళిక సరిహద్దులతో ఎటువంటి సంబంధం లేకుండా అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.