హాంకాంగ్ లో మళ్ళీ ఈ మధ్య చెలరేగుతున్న అల్లర్లు ‘ కొత్త పోకడను ‘ సృష్టిస్తున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి హాంకాంగ్ పోలీసులు తుపాకులు చేతబట్టుకుని ‘ వీర యోధుల్లా ‘ ముందుకు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. ముఖ్యంగా చైనా యువతులు వారిని చూసి మనసులు పారేసుకుంటున్నారు. వారి కండల శరీరాలు ఆ అమ్మాయిలను కట్టిపడేస్తున్నాయట.. గన్లు, పొడవాటి లేటెస్ట్ రైఫిళ్లతో ఆ పోలీసులు రోడ్లపై నిరసనకారుల వెంట పరుగులు తీస్తుంటే ఇక్కడ చైనా గాళ్స్.. మనస్సుల్లో వలపు ‘ కాక ‘ పుడుతోందని అక్కడి వెబ్ సైట్లు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు లాయు చాక్ -కెని అనే 43 ఏళ్ళ పోలీసాయనకు 7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారట.. బాల్డ్ హెడ్ తో ఉన్న ఆయనను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని కొందరు అమ్మాయిలు ముచ్చట పడుతున్నట్టు భోగట్టా.. ఆయనను వీరంతా వీర యోధునిగా అభివర్ణిస్తున్నారు.. గత జులైలో నిరసనకారులపై తుపాకీ ఎత్తిపెట్టి ఠీవిగా నిలబడిన ఆయన.. ఆ తరువాత చైనా వెళ్లిన సందర్భంలో ‘ అద్భుతమైన ‘ వెల్ కమ్ లభించింది. ఇలాగే మరో పోలీసుకు సోషల్ మీడియాలో 74 వేల మంది ఫాలోవర్లు ఉన్నట్టు డైలీ మెయిల్ రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే చైనా అమ్మాయిలు హాంకాంగ్ లో వాలిపోయి.. ఈ పోలీసోళ్ళ మీద వలపు వల విసిరే సమయం దగ్గర్లోనే ఉందని ఆ సైట్ పేర్కొంది.