కరోనా ఎఫెక్ట్: క్వారంటైన్‌లో సీఆర్‌పీఎఫ్ డీజీ..!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఉదయం వరకు దేశవ్యాప్తంగా మొత్తం

కరోనా ఎఫెక్ట్: క్వారంటైన్‌లో సీఆర్‌పీఎఫ్ డీజీ..!

Edited By:

Updated on: Apr 05, 2020 | 5:55 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఉదయం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,374 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 77 మంది మృతి చెందారు. కర్ణాటకలో ఒకరు, తమిళనాడులో ఒకరు కొత్తగా ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. సీఆర్‌పీఎఫ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఆయనను పరోక్షంగా కలిసిన సీఆర్‌పీఎఫ్ డీజీ మహేశ్వరి పరీక్షల కోసం తమ నమూనాలు అందజేశారు. మరో 20 మంది సీనియర్ భద్రతాధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మొత్తంగా 20 మంది సీఆర్‌పీఎఫ్ అధికారులు గత రెండు రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలో అత్యధికంగా మూడు లక్షల మంది కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. ఇటలీలో అత్యధికంగా 13 వేల మంది మృత్యువాత పడ్డారు.