హోంగార్డు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.హోమ్‌గార్డు సమయానికి చక్కగా స్పందించాడు కానీ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. అసలేం జరిగిందంటే… ఫలక్‌నూమా రైల్వే ట్రాక్ కింద హఠాత్తుగా భూమి కుంగింది.. మామూలుగా కాదు… ఎనిమిది మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యే ఏర్పడింది.. ఆ సమయంలో ప్రయాణికుల రైళ్ల రాకపోకలు లేవు కాబట్టి పెను ప్రమాదం తప్పింది.. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోమ్‌గార్డు ఆ గొయ్యిని చూశాడు.. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చాడు.. రైల్వే అధికారులు కూడా వెంటనే అలెర్టయ్యారు.. ఆ ట్రాక్‌కు వెళ్లాల్సిన గూడ్స్‌ను నిలిపివేశారు.. ఇప్పుడా గొయ్యిని పూడ్చే పనిలో పడ్డారు అధికారులు.