అక్టోబర్ 2న… మహాత్మా గాంధీ జయంతి రోజున బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. అక్టోబరు 2న మొదలుపెట్టి 31న వల్లభాయ్ పటేల్ జయంతి వరకు 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించాలని నిర్దేశించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల పునరుజ్జీవం, స్వయంసమృద్ధి, మొక్కలు నాటడం, జీరో బడ్జెట్ వ్యవసాయం అంశాలపై చైతన్యం ఈ పాదయాత్ర ప్రధాన లక్ష్యం. కాగా.. కేంద్రంలో లేదా రాష్ట్రాల్లో మంత్రి పదవులు నిర్వహించిన బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ ఈ వారంలోనే భేటీ కానున్నట్లు తెలిసింది.