బిగ్ బాస్ వివాదం.. కంటెస్టెంట్ భార్య పోలీసులకు ఫిర్యాదు!

|

Nov 25, 2019 | 3:01 AM

సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయింది. అయితే కాంట్రవర్సీలు ఎన్నో ఏర్పడినా.. షో మాత్రం హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ ఫటక్ భార్య అశ్వినీ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వికాస్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలకు గానూ ఖార్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును అశ్వినీ అందజేశారు. ‘సోషల్ మీడియాలో చాలామంది వికాస్‌కు […]

బిగ్ బాస్ వివాదం.. కంటెస్టెంట్ భార్య పోలీసులకు ఫిర్యాదు!
Follow us on

సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయింది. అయితే కాంట్రవర్సీలు ఎన్నో ఏర్పడినా.. షో మాత్రం హయ్యస్ట్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ వికాస్ ఫటక్ భార్య అశ్వినీ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. వికాస్ మీద సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలకు గానూ ఖార్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును అశ్వినీ అందజేశారు.

‘సోషల్ మీడియాలో చాలామంది వికాస్‌కు వ్యతిరేకంగా అనేక తప్పుడు సందేశాలను, ప్రకటనలను, వీడియోలను రూపొందించడమే కాకుండా తమకు తాముగా వికాస్ కుటుంబీకులమంటూ వెల్లడిస్తున్నారు. ఇక ఇలా చెబుతున్న వాళ్ళెవ్వరూ కూడా వికాస్ కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. వికాస్‌‌కు తల్లి, కొడుకు, అత్తగారు, నాన్న, మేనల్లుడు సందేశ్ మాత్రమే సొంత వ్యక్తులని.. బయటవాళ్లెవరైనా ఏదైనా తప్పుడు చర్యలకు పూనుకుంటే.. తమకు ఎటువంటి సంబంధం లేదని’ వికాస్ భార్య అశ్వినీ లెటర్‌లో పేర్కొంది. అటు మీడియాకు కూడా విన్నవిస్తూ.. వికాస్ చుట్టాలని చెప్పుకుంటున్న ఫేక్ వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయవద్దని తెలిపింది.