Himachal Pradesh: మంచు కురిసే వేళలో.. మురిసిపోతోన్న ప్రకృతి ప్రియులు
హిమాచల్‌ను మంచు దుప్పటి కప్పేసింది. పర్యాటక ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంతో నిండిపోయి టూరిస్టులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఆ మంచువానలో తడుస్తూ.. భూలోక స్వర్గాన్ని ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. అందాలలో... రహదారులు కొత్త రూపును సంతరించుకున్నాయి. హిమపాతంలో తడిచే ఇళ్లు.. భలే మద్దుగా ఉన్నాయి..
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి మంచు దుప్పటి కప్పుకుని మెస్మరైజ్ చేస్తోంది. కనులారా చూసి, మనసారా తరించమని ప్రకృతి ప్రియులను నిండు మనస్సుతో పిలుస్తోంది. సిమ్లాలో పాల నురగల్లాంటి మంచు అందాలు టూరిస్టుల మనసును దోచేస్తున్నాయి. ప్రకృతి రమ్యత… ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని ఊహించి అందమైన పెయింటింగ్ గీసినట్లు కనిపిస్తున్నాయి హిమాచల్‌లోని గిరి ప్రాంతాలు. అంతటి మనోహర ప్రకృతి వైభవాన్ని చూసి ముగ్ధులవుతున్నారు టూరిస్టులు. మంచువానలో ఓలలాడుతూ.. ఇది కదా భూలోక స్వర్గం అని మురిసిపోతున్నారు.
VIDEO | Himachal Pradesh: The city of Shimla receives second snowfall of the season. #HimachalPradesh #Shimla #Snowfall pic.twitter.com/nQ7eC8bmL6
— Press Trust of India (@PTI_News) December 23, 2024
హిమాచల్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మరో వారం రోజుల పాటు సిమ్లాలో మంచుతీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉనా, హమీర్పూర్, చంబా, మండి జిల్లాల్లో కూడా చలితీవ్రత పెరిగింది. పలు ప్రాంతాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంచు సీజన్ ప్రారంభం కావడంతో యాపిల్ పండించే రైతులు సంతోషంగా ఉన్నారు. దేశం నలుమూలల నుంచి టూరిస్టులు హిమాచల్‌కు చేరుకుంటున్నారు. మైనస్ డిగ్రీల చలికి వణికిపోతున్నా.. చలిమంటలు కాచుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నారే కానీ, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనిపించడం లేదంటున్నారు. మనాలిలో మంచు కురియడంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. టూరిస్టుల రాకతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు.
#WATCH मनाली, हिमाचल प्रदेश: भाजपा सांसद कंगना रनौत ने कहा, “मेरे यहां आते ही बर्फबारी शुरू हो गई है। इससे पर्यटन की भी शुरूआत हो जाएगी। मैं उम्मीद करती हूं कि पूरे देश से लोग हमारे यहां पर्यटन के लिए आएंगे…” pic.twitter.com/vxd9K73IjW
— ANI_HindiNews (@AHindinews) December 23, 2024
చెట్లు, ఇళ్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నింటినీ మంచు కప్పేయడంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు. అధిక మంచు వల్ల రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువే. అందుకే పర్వత ప్రాంతాల్లో తిరిగే పర్యటకులు, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. మంచుతో కొత్త అందాలను సంతరించుకున్నాయి కొండ ప్రాంతాలు. ఎటుచూసినా మంచు కనువిందు చేస్తోంది. దీంతో శ్రీనగర్‌తో సహా పలు ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తారు. గుల్మార్గ్లో మంచు క్రీడలు ఊపందుకున్నాయి.