TDP Praja Chytanya Yatra from February 19th onwards across the state: తొమ్మిది నెలల జగన్ పరిపాలనలో తొమ్మిది మోసాలంటూ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తెలుగుదేశం పార్టీ తుది మెరుగులు దిద్దితోంది. తొమ్మిది నెలలు.. తొమ్మిది మోసాలు.. తొమ్మిది రద్దులు.. తొమ్మిది భారాలు అంటూ ఎజెండా సిద్దం చేసి రంగంలోకి దిగుతోంది విపక్ష తెలుగుదేశం పార్టీ.
బుధవారం నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానున్న టీడీపీ ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మంగళవారం విడుదల చేశారు. రేపటి నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభం అవుతున్నాయని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ప్రజా చైతన్య యాత్రలను బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Also read: Purandeshwari strong warning to political opponents on wrong propaganda
ఈ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దుపై పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తున్న టీడీపీ నేతలు.. ఆ అంశాన్ని కూడా ప్రజా చైతన్య యాత్రలో ఎండగట్టనున్నారు.