Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !

|

Dec 28, 2020 | 9:04 PM

సరిగ్గా వండాలి కానీ..చేపల పులుసు రుచి వర్ణించడం వీలవుతుందా..దాన్ని అనుభవించాలి అంతే. చేపల్లో ఫేమస్ అంటే పులస గురించే ఎక్కువమంది మాట్లాడుతారు. నో డౌట్....

Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !
Follow us on

సరిగ్గా వండాలి కానీ..చేపల పులుసు రుచి వర్ణించడం వీలవుతుందా..దాన్ని అనుభవించాలి అంతే. చేపల్లో ఫేమస్ అంటే పులస గురించే ఎక్కువమంది మాట్లాడుతారు. నో డౌట్. పులస టేస్ట్‌ను డామినేట్ చేసే లెవల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ చేపకు లేదు. అయితే మడ్డువలస చేపలు కూడా మంచి రుచిని కలిగి ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా మడ్డువలస రిజర్వాయర్‌ ప్రాంతంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు తక్కువ ధర ఉండటంతో నాన్-వెజ్ ప్రియులు ఆ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. సండే వచ్చిందంటే ఆ ప్రాంతాల్లో సందడి మాములుగా ఉండటం లేదు. వీక్ డేస్‌లోనూ రద్దీ బాగానే ఉంటుంది. అక్కడ  తిలాఫియా,  రొయ్య, బొచ్చ, ఎర్రమైలు, రాగండి, బంగారుపాప వంటి అరుదైన రకాలు దొరుకుతాయి.

Also Read :Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..