విజయవాడలో హైఅలెర్ట్.. ప్రకాశం బ్యారేజ్ మూసివేత!

|

Jan 20, 2020 | 11:25 AM

నేటి నుంచి ఏపీ క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు విజయవాడలో హైఎలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలకు అనుమతులు లేవని.. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు హెచ్చరించారు. ఇక ఇప్పటికే అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో.. టీడీపీ నేతలు, అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. అంతేకాకుండా ఇవాళ ఉదయం నుంచే ప్రకాశం బ్యారేజ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ […]

విజయవాడలో హైఅలెర్ట్.. ప్రకాశం బ్యారేజ్ మూసివేత!
Krishna River
Follow us on

నేటి నుంచి ఏపీ క్యాబినెట్, అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు విజయవాడలో హైఎలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలకు అనుమతులు లేవని.. నిబంధనలకు విరుద్ధంగా ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు హెచ్చరించారు. ఇక ఇప్పటికే అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో.. టీడీపీ నేతలు, అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు.

అంతేకాకుండా ఇవాళ ఉదయం నుంచే ప్రకాశం బ్యారేజ్‌ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ దారి నుంచి అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లేవారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ధర్నా చౌక్, బందర్ రోడ్డు, బెంజ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, స్టేట్ గెస్ట్ హౌస్, రాజ్ భవన్, తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు సీపీ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు చేపట్టకూడదని మరోసారి ఆయన హెచ్చరించారు.

మరోవైపు నగరమంతటా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో.. ఏలూరు, వైజాగ్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచే దారి మళ్లించనున్నారు. కాగా, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఇబ్రహీంపట్నం నుంచి దారి మళ్లించనున్నట్లు తెలుస్తోంది.