జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవానులపై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా తరహాలో గుజరాత్ లో కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సూచించింది. దీంతో అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. అలాగే ముఖ్యమైన రైల్వే స్టేషన్లు, తీర ప్రాంతం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ధార్మిక స్థలాలు, సినిమా హాళ్ళు మొదలైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.