AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛార్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరోయిన్..

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఛార్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఛార్మీ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియా వేదికగా...

ఛార్మీ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరోయిన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 17, 2020 | 12:37 PM

Share

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఛార్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఛార్మీ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్యనే వాళ్ల ఫ్యామిలీలో ఓ బాబు పుడితే.. ఆ ఆనందాన్ని సామాజిక మాధ్యమంలో షేర్ చేసింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపిన క్షణాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తనకెంతో ఇష్టమైన ఓ కుటుంబ సభ్యురాలు కన్ను మూయడంతో.. ఎమోషనల్ అయింది ఛార్మీ.

‘తనకు వరుసకు ఆంటీ అయ్యే ఆవిడ చనిపోవడంతో.. ఆమెతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిన్ననే తనతో వీడియో కాల్ మాట్లాడాను. విధికి ఎవరైనా తల వంచక తప్పదు. ఆమె లేని లోటు తీర్చలేనిది. నా ప్రియమైన ఆంటీ ఆత్మకు శాంతి చేకూరాలని ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది’ ఛార్మీ.

Read More: 

లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..

షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ ‘షేర్ యాప్’..