ఈ మధ్యకాలం యువత ఫోన్‌ను విపరీతంగా ఉపయోగిస్తుంటారు. యూట్యూబ్ వీడియోలు, బ్రౌజింగ్, చాటింగ్ ఇలా ఒకటేమిటి.. చాలా వ్యవహారాలు ఉన్నాయి. నిర్విరామంగా ఆన్లైన్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ లైట్ కాంతికి మన కళ్ళు కాస్త ఒత్తిడికి లోనయినట్లు అనిపిస్తుంది. అంతేకాక ఫోన్ బ్యాటరీ కూడా జీవితకాలం రాకూండా త్వరగా అయిపోతుంది. అయితే ఈ సమస్యను ఈజీగా అధిగమించవచ్చు. గూగుల్ క్రోమ్‌లోని డార్క్ మోడ్ ఎనేబుల్ చేస్తే మన కళ్ళు సురక్షితంగా ఉంటాయి. ఇక ఈ డార్క్ మోడ్ వివిధ రకాల సాఫ్ట్‌వేర్లలో ఎలా ఎనేబుల్ చేయొచ్చో తెలుసుకుందాం.
విండోస్ 10 సాఫ్ట్‌వేర్…
కంప్యూటర్ లోని సెట్టింగ్స్ మెనూ ఓపెన్ చేశాక.. పర్సనలైజేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఆ ఆప్షన్ ను క్లిక్ చేసి కలర్స్ ను ఓపెన్ చేసి అక్కడ ‘Choose your default app mode’ను ఎనేబుల్ చేయాలి. దాన్ని డార్క్ కు మారిస్తే.. క్రోమ్ ను రీస్టార్ట్ చేయకుండానే డార్క్ మోడ్ ఎనేబుల్ అయిపోతుంది.
మాక్ ఓఎస్ సాఫ్ట్‌వేర్…
సిస్టం ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయండి. అందులో జనరల్ పై క్లిక్ చేసి.. అప్పియరెన్స్ ను ఎంచుకోండి. ఇక అక్కడ కనిపించే ఆప్షన్లలో డార్క్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. అంటే డార్క్ మోడ్‌లోకి మారిపోతుంది.
ఆండ్రాయిడ్ వెర్షన్…