ముంబై, థానే, పాల్ఘర్‌లలో అతి భారీ వర్షాలు: ఐఎండి

| Edited By:

Aug 14, 2020 | 12:40 PM

ముంబై, థానే, పాల్ఘర్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచి

ముంబై, థానే, పాల్ఘర్‌లలో అతి భారీ వర్షాలు: ఐఎండి
Follow us on

Heavy Rains likely in Mumbai: ముంబై, థానే, పాల్ఘర్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు నిలిచి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా మహమ్మారికి కుండపోత వానలు తోడవడంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం సైతం ముంబై మహానగరంతోపాటు ధానే, పాల్ఘర్, రాయ్గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ముంపు ప్రాంతాల్లో బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!