మృగశిర కార్తె.. కిటకిటలాడిన ముషీరాబాద్‌ ఫిష్‌ మార్కెట్‌..

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద చేపల మార్కెట్‌ ముషీరాబాద్‌ ఫిష్‌ మార్కెట్‌. ఇక్కడ రోజూ లక్షల రూపాయాల వ్యాపార లావాదేవిలు జరుగుతుంటాయి. చేపలు కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల

మృగశిర కార్తె.. కిటకిటలాడిన ముషీరాబాద్‌ ఫిష్‌ మార్కెట్‌..

Edited By:

Updated on: Jun 07, 2020 | 6:54 PM

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద చేపల మార్కెట్‌ ముషీరాబాద్‌ ఫిష్‌ మార్కెట్‌. ఇక్కడ రోజూ లక్షల రూపాయాల వ్యాపార లావాదేవిలు జరుగుతుంటాయి. చేపలు కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారితో ప్రతిరోజు మార్కెట్ కిక్కిరిసిపోతుంటుంది. ఆదివారం వినియోగదారుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తింటే వ్యాధులు దూరమవుతాయనేది జనం బలంగా నమ్ముతారు.

కాగా.. రేపటినుంచి (సోమవారం) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుండటంతో వందలాది మంది చేపలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వస్తున్నారు. దీంతో ఆదివారం వినియోగదారుల రద్దీ మరింత ఎక్కువగా కనిపించింది. సాధారణ ధర కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే ఫర్వాలేదు, కానీ కరోనా మహ్మమారి విజృభిస్తున్న తరుణంలో జనం ఇలా గుమ్మిగూడడం ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే ప్రతి ఒక్కరూ కరోనా నింబంధలు పాటించాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..