హైదరాబాద్ తో పోటీ పడిన ముంబై, భారీ వర్షాలతో సతమతం. రెడ్ అలెర్ట్ జారీ

| Edited By: Anil kumar poka

Oct 15, 2020 | 12:53 PM

భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. పది ఏళ్లలో రెండో సారి అక్టోబరులో  ఈ నగరం ఇలా వర్షాలతో పోటెత్తింది. ముంబైతో బాటు పూణే, కొంకణ్ కోస్తా, కూడా వర్షాలు, వరద తాకిడికి గురయ్యాయి..

హైదరాబాద్ తో పోటీ పడిన ముంబై, భారీ వర్షాలతో సతమతం. రెడ్ అలెర్ట్ జారీ
Follow us on

భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. పది ఏళ్లలో రెండో సారి అక్టోబరులో  ఈ నగరం ఇలా వర్షాలతో పోటెత్తింది. ముంబైతో బాటు పూణే, కొంకణ్ కోస్తా, కూడా వర్షాలు, వరద తాకిడికి గురయ్యాయి. బుధవారం ఒక్కరోజే ఈ నగరంలో 144. 8 మీ.మీ. వర్షపాతం నమోదైంది. 2012 అక్టోబరు నెలలోనే 197.7 మీ.మీ, వర్షం  పడిందని వాతావరణ శాఖ గుర్తు చేసింది. బుధవారం ఉదయం నుంచే పెనుగాలులతో మబ్బు మసకేసింది. వోర్లీ, నవీ ముంబై, తదితర చోట్ల 101 మీ.మీ. వర్షం పడిందని అంచనా. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  దీంతో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.