నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు

|

Oct 16, 2020 | 7:10 AM

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర్ పూర్తిగా జలధిగ్బంధంలోకి వెళ్లింది. అటు భారీ వరదలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.

నిండుకుండలను తలపిస్తున్న ప్రాజెక్టులు
Follow us on

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర్ పూర్తిగా జలధిగ్బంధంలోకి వెళ్లింది. అటు భారీ వరదలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం 46,186 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 10 గేట్ల ద్వారా 47,348 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో 26 గేట్లు ఎత్తి లక్షా 5వేల క్యూసెక్కును విడుదల చేస్తున్నారు. కాగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి 90 టీఎంసీలు చేరుకుంది.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో నిండింది. జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండడంతో.. 14గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. 17 టీఎంసీల సామర్థ్యానికిగాను జలాశయంలో ప్రస్తుతం 16 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అటు, సింగూరు ప్రాజెక్టుకు 39,103 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 28,826 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 29.917 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రాజెక్టులో ప్రస్తుతం 28.390 టీఎంసీల నీటి నిల్వ ఉంది.