Coronavirus: గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలకు కేంద్రం మార్గదర్శకాలు…

|

Jul 19, 2020 | 2:18 PM

కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం గేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.

Coronavirus: గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలకు కేంద్రం మార్గదర్శకాలు...
Follow us on

COVID-19 guidelines for gated residential complexes: కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం గేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంట్రీ పాయింట్స్, వర్క్ ప్లేసెస్‌లో శానిటైజర్లు తప్పనిసరిగా పెట్టాలని సూచించింది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద విజిటర్స్, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని తెలిపింది. అలాగే లక్షణాలు లేనివారిని మాత్రమే లోపలికి అనుమతించాలంది. విక్రేతదారులు, పనివాళ్లు, కార్ క్లీనర్స్, డెలివరీ బాయ్స్ అందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

పార్కులు, కారిడార్లు, లిఫ్ట్ లాబీలు, జిమ్‌లు, క్లబ్‌లు మొదలైన అన్ని సాధారణ ప్రాంతాలలో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలంది. అలాగే 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీలు, 10 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లులు ఇంట్లోనే ఉండాలని తెలిపింది. ఇక తరుచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించాలని చెప్పింది. అటు ఉమ్మి వేయడం నిషేదించాలని.. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే జిల్లా హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఒకవేళ గేటెడ్ కాంప్లెక్స్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లయితే, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ) స్థానిక ఆరోగ్య అధికారులతో సహకరించి, నియంత్రణ ప్రణాళికలో పేర్కొన్న విధంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

Also Read:

తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..

సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..

2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..

ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..