HCL Will Recruit More Employees: కరోనా కారణంగా గతేడాది ఉద్యోగ నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. కొత్త ఉద్యోగాలే కాకుండా కొంత మంది అప్పటికే చేస్తోన్న ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. టీకా వస్తుండడం, మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుండడంతో ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమవుతోంది. గడిచిన ఏడాది కారణంగా ఉద్యోగ నియామకాలను తగ్గించిన ఈ సంస్థ.. వచ్చే ఆరు నెలల్లో మాత్రం ఏకంగా 20 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో పాటు.. హెచ్‌సీఎల్ ఇప్పటికే అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వచ్చే ఆరు నెలల్లో 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ సీఈఓ విజయ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే నోయిడా కేంద్రంగా ఐటీ సేవలందిస్తున్నఈ కంపెనీ గతేడాది 10 బిలియన్ డాలర్ల మైలురాయికి చేరుకుంది.
Also Read: Altroz Trim: టాటా మోటార్స్ నుంచి ‘ఆల్ట్రోజ్ ట్రిమ్’ ఆవిష్కరణ.. ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా..