కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే.. విరాట్‌కి వీవీఎస్ లక్ష్మణ్ మద్దతు

| Edited By:

Nov 21, 2020 | 10:12 AM

తన భార్య, నటి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లీ.. బీసీసీఐని పెటర్నిటీ లీవ్‌ని కోరిన విషయం తెలిసిందే.

కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందే.. విరాట్‌కి వీవీఎస్ లక్ష్మణ్ మద్దతు
Follow us on

Kohli Paternity Leave: తన భార్య, నటి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లీ.. బీసీసీఐని పెటర్నిటీ లీవ్‌ని కోరిన విషయం తెలిసిందే. దానికి స్పందించిన బీసీసీఐ సెలవులు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో ఫస్ట్‌ టెస్ట్‌ ముగిసిన వెంటనే కోహ్లీ భారత్‌కి తిరిగి రానున్నారు. అయితే కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది విమర్శలు చేశారు. ఇంతకుముందు చాలా మంది క్రికెటర్లు కుటుంబం కంటే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని.. ఆస్ట్రేలియా టూర్‌, టీమిండియాకు కీలకమైనది కాగా, ఈ సమయంలో కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అంటూ విమర్శించారు.  (‘కలర్‌ ఫొటో’ను వదలుకున్న నిహారిక.. చాందిని మొదటి ఆప్షన్ కాదట)

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. కోహ్లీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కోహ్లీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. నువ్వు ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావొచ్చు, కానీ నీకు ఒక కుటుంబం ఉంటుంది. నీ కుటుంబానికి ఏది మంచి అన్నది నువ్వు ఆలోచించాలి. అందుకే కోహ్లీ నిర్ణయానికి నేను మద్దతు చెబుతున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ క్షణాలు చాలా ముఖ్యమైనవి అని అన్నారు. (నేను వద్దన్నా నా టైటిల్‌ తీసుకున్నావు.. కరణ్‌ జోహార్‌పై ప్రముఖ దర్శకుడు మధుర్‌ బండార్కర్‌ ఫైర్‌)

కాగా లక్ష్మణ్ కూడా తన మొదటి బిడ్డ పుట్టిన సమయంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. రెండో బిడ్డ పుట్టే సమయంలో కొన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను వదులుకొని పెటర్నిటీ లీవ్ తీసుకున్నారు. దానిపై స్పందిస్తూ.. నా కుమార్తె పుట్టే సమయంలో నేను కొన్ని రంజీ ట్రోఫీలను వదులుకొని నా భార్య దగ్గర ఉన్నా. ఆ క్షణాలు చాలా ముఖ్యమైనవి అని ఆయన లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. (నవంబర్ 26న ఏపీలో అమూల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం: మంత్రి సీదిరి అప్పలరాజు)