హర్యానా రాష్ట్రంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకోగా, భర్త మరణం తట్టుకోలేక భార్య, ఇద్దరు కూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఉదంతంలో భార్య, భర్తలతోపాటు నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, పదేళ్ల మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హర్యానాలోని రోహతక్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ షహారణ్(38) స్థానికంగా ఉన్న ఓ నర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రమోద్ భార్య మీనాక్షి కూడా లెక్చరర్ గా పనిచేస్తోంది. వీరికి ఎన్నా(10), ప్రీశా(4) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే బుధవారం ప్రమోద్ బుధవారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తూనే మార్గమధ్యలోనే విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య కంటే ముందు ఈ విషయాన్ని తన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేశాడు. దీంతో మిత్రులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రమోద్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
భర్త ఆత్మహత్య విషయం మీనాక్షికి తెలియడంతో.. ఆమె కూడా తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్థానికంగా ఉన్న చెరువులో పిల్లలను తోసేసి ఆమె దూకింది. మీనాక్షి, ప్రీశా నీటిలో మునిగిపోగా, ఎన్నా ప్రాణాలతో ఒడ్డుకు చేరింది. ప్రాణాలతో బయటపడ్డ ఎన్నా స్థానికులకు సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. చెరువులో నుంచి మీనాక్షి, ప్రీశా మృతదేహాలను గురువారం ఉదయం వెలికితీశారు. అయితే ప్రమోద్, మీనాక్షి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Haryana PGIMS Doctor Commits Suicide, His Wife and Two Daughter Jumps from Building in Rohtak | The doctor took poison by eating poison; On discovering this, the wife jumped into the water tank with 2 daughters; One daughter lives https://t.co/Xv2tShrP0A
— MediaBreaking (@MediaBreaking1) September 24, 2020