లాక్‌డౌన్ నేపథ్యంలో.. విద్యార్ధుల కోసం.. 31 బస్సులు పంపిన హర్యానా..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కోవిద్-19 లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకున్న 800 మంది విద్యార్ధులను తీసుకొచ్చేందుకు హర్యానా ప్రభుత్వం 31 బస్సులను

లాక్‌డౌన్ నేపథ్యంలో.. విద్యార్ధుల కోసం.. 31 బస్సులు పంపిన హర్యానా..

Edited By:

Updated on: Apr 23, 2020 | 5:47 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కోవిద్-19 లాక్‌డౌన్ కారణంగా రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకున్న 800 మంది విద్యార్ధులను తీసుకొచ్చేందుకు హర్యానా ప్రభుత్వం 31 బస్సులను పంపించింది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హర్యానా నుంచి వెళ్లిన విద్యార్ధులు… లాక్‌డౌన్ కారణంగా కోట పట్టణంలోని ఓ కోచింగ్ హబ్‌లో చిక్కుకున్నారు.

కాగా.. ‘‘విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు హర్యానా రోడ్‌వేస్‌కి చెందిన 31 బస్సులను కోటకి పంపించాం. రేవారీ, నార్నౌల్ డిపోల నుంచి విద్యార్ధుల కోసం బస్సులు వెళ్లాయి…’’ అని హర్యానా రవాణా మంత్రి మూల్ చంద్ శర్మ పేర్కొన్నారు. ఈ బస్సుల్లో దాదాపు 850 మంది విద్యార్ధులు తమ ఇళ్లకు చేరుకుంటారని భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Also Read: రంజాన్ నేపథ్యంలో.. దుబాయ్ రాజు.. సంచలన నిర్ణయం..